జీవితమే నటన

మహిధర్, శ్రావ్యరావు జంటగా నటిస్తున్న చిత్రం నటన. భారతీబాబు దర్శకుడు. కుబేరప్రసాద్ నిర్మాత. ప్రభు ప్రవీణ్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. శివాజీరాజా, భానుచందర్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ జీవితం గురించి తెలియజెప్పే కథాంశమిది. ఆద్యంతం భావోద్వేగప్రధానంగా సాగుతుంది. కథానుగుణంగానే టైటిల్ పెట్టాం అన్నారు. చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉందని భానుచందర్ చెప్పారు. నాలుగు పాటలు అద్భుతంగా కుదిరాయని, త్వరలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.