కార్య‌క‌ర్త‌లారా.. త‌స్మా జాగ్ర‌త్త !

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు హెచ్చ‌రిక‌లు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కార్య‌క‌ర్త‌లంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తాజాగా త‌న ట్వీట్‌లో కోరారు. ఇటీవ‌ల ఆ రాష్ట్రంలో ఈవీఎంల‌ను ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఆ సంఘ‌ట‌న‌ల‌ను త‌న ట్వీట్‌లో రాహుల్ పోస్టు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఈవీఎంలు వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌ని, రెండు రోజుల క్రితం ఓ డ్రైవ‌ర్ ఈవీఎంల వ్యాన్‌ను ఎత్తుకెళ్లాడ‌ని, కొంద‌రేమో తాగుతూ హోట‌ల్స్‌లో క‌నిపిస్తున్నార‌ని రాహుల్ తెలిపారు. మోదీ పాల‌న‌లో ఈవీఎంలు వింత శ‌క్తులుగా ప‌నిచేస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, కాబ‌ట్టి కార్య‌క‌ర్త‌లంతా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని త‌న ట్వీట్ ద్వారా సూచించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తో పాటు రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, తెలంగాణ‌, మిజోరం రాష్ట్రాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల కౌంటింగ్ ఈనెల 11వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ది.

Related Stories: