ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల పూజలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు ఖైరతాబాద్ గణేశుడి మండపానికి చేరుకున్నారు. శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో కొలువు దీరిన గణేశుడికి గవర్నర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పోరేటర్ విజయారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్‌తోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
× RELATED ఆ ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో..