మ‌ల్టీ స్టార‌ర్ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో మ‌ల్టీ స్టార‌ర్స్ హ‌వా ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో అయితే స్టార్ హీరోలు, కుర్ర హీరోలు క‌లిసి వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో విభిన్న చిత్రాల‌ని చేస్తున్నారు. ఇక త‌మిళంలో అరవింద్ స్వామి.. సందీప్ కిషన్.. శ్రీయ.. మరియు ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రల్లో న‌ర‌గ‌సూర‌న్ అనే చిత్రం రూపొందుతుంది . తెలుగులో ఈ చిత్రం న‌ర‌కాసురుడు అనే టైటిల్‌తో విడుద‌ల కానుంది. కార్తిక్ నారేన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ నిర్మిస్తున్నారు. థ్రిల్ల‌ర్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఎప్పుడో తను చేసిన తప్పుడు పనులన్నీ మానేసిన ఒక మాఫియా డాన్.. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ కి వస్తే ఏంటి పరిస్థితి అనే నేపథ్యంలో.. ఒక థ్రిల్లర్ తరహాలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాల‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ప్ర‌ధాన పాత్ర‌లు త‌మ అనుభ‌వాల‌ని చెబుతున్న స‌న్నివేశాల‌తో ట్రైలర్ క‌ట్ చేశారు. తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Related Stories: