ట్రైల‌ర్‌తో సినిమాపై పెరిగిన ఆస‌క్తి

ఇటీవ‌ల స‌మ్మోహ‌నం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా నన్ను దోచుకుందువ‌టే చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్ ఎస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో న‌న్ను దోచుకుందువటే అనే చిత్రం తెర‌కెక్కింది . సెప్టెంబ‌ర్ 21న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా , ప్ర‌మోష‌న్స్ విష‌యంలో స్పీడ్ పెంచారు మేకర్స్. చిత్రంలో సుధీర్ బాబు కాస్త డిఫ‌రెంట్ మెంటాలిటీ ఉన్న మేనేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, హీరోయిన్ న‌బా న‌టేష్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా క‌నిపించనుంది. కీలక పాత్రల్లో నాజర్‌, వేణులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు . ఇటీవ‌ల సొంత ప్రొడ‌క్ష‌న్ హౌజ్ స్థాపించిన సుధీర్ బాబు త‌న నిర్మాణ సంస్థ‌లో తొలి చిత్రంగా నన్ను దోచుకుందువ‌టే సినిమా చేసాడు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్స్‌,సాంగ్స్ , టీజ‌ర్స్ అల‌రించ‌గా తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉండటంతో పాటు మూవీపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించింది. మ‌రి ఆ ట్రైల‌ర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.

Related Stories: