పోలీస్ పాత్రలో...

ఓ సినిమా పూర్తయ్యేలోపు మరో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్‌సిగ్నలిస్తూ ఫుల్ స్పీడుమీదున్నారు నాని. గత చిత్రం కృష్ణార్జున యుద్ధం పరాజయం పాలైన ఆయన జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. తాజాగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాని పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు తెలిసింది. వాస్తవిక అంశాలకు ప్రాముఖ్యతనిస్తూ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని...నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ చిత్రం దేవదాస్‌తో పాటు గౌతమ్‌తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న జెర్సీ సినిమా చేస్తున్నారు.

Related Stories: