నాని చేతిపై ఉన్న స్టైలిష్ టాటూ గమనించారా

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఎంసీఏ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. డబుల్ హ్యట్రిక్ విజయాలు అందుకున్న నాని ఇప్పుడు ట్రిపుల్ హ్యట్రిక్ వైపు పరిగెడుతున్నాడు. అయితే నాని చేతిపై ఉన్న టాటూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ ఏడాది డబుల్ హ్యట్రిక్ సాధించడంతో రీసెంట్ గా ఓ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాని కూడా హాజరయ్యాడు. ఆ టైంలో నాని చేతిపై ఉన్న టాటూ పలువురు దృష్టిని ఆకర్షించింది. కుడి చేతిపై ఉన్న ఈ టాటూ తన వైఫ్ అంజనా, కుమారుడు అర్జున్ పేర్లలోని ఫస్ట్ లెటర్ గా తెలుస్తుంది. నాని ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ పోషించనున్నట్టు సమాచారం.

Related Stories: