క‌నుమ‌కి నాని ఇచ్చిన గిఫ్ట్ అదిరింది

నేచుర‌ల్ స్టార్ నాని క‌నుమ సంద‌ర్భంగా త‌న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం మూవీలోని తొలి లిరిక‌ల్ సాంగ్‌ని విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్టుగానే కొద్ది సేప‌టి క్రితం దారి చూడు దమ్మూ చూడు మామ..’ అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేశారు. హిప్ హాప్ త‌మీజా సంగీతంలో రూపొందిన ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. పెంచ‌ల్ దాస్ ఈసాంగ్‌కి లిరిక్స్ అందించ‌డ‌మే కాదు పాట కూడా పాడి అల‌రించాడు. నాని ఈ చిత్రంలో కృష్ణ‌, అర్జున్ అనే రెండు పాత్ర‌ల‌లో నటిస్తుండ‌గా, ఈ పాత్ర‌లకి సంబంధించిన లుక్స్ కూడా ఇప్ప‌టికే విడుద‌ల‌య్యాయి. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్‌ నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తుండ‌గా, మూవీని ఏప్రిల్ 12న గ్రాండ్‌గా విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?