ఫ్యాన్స్ సమక్షంలో మజ్ను సక్సెస్ సెలబ్రేషన్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మజ్ను. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకోగా, ప్రస్తుతం బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్ళనే రాబడుతుంది. ఈ నేపధ్యంలో సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు టీం సెప్టెంబర్30, అక్టోబర్ 1 తేదీలలో వైజాగ్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్ళనున్నారు. మజ్ను చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లలో నానితో పాటు చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకని జరుపుకోనుంది. ఇప్పటికే మూడు వరుస హిట్స్‌తో జోష్ మీదున్న నాని మజ్ను చిత్రంతో మరో హిట్ అందుకోవడంతో ఫుల్ ఖుష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం నాని నేను లోకల్ అనే చిత్రంతో బిజీగా ఉండగా, ఆ తరువాత అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ వెరైటీ కథాచిత్రాన్ని చేయనున్నాడు.
× RELATED టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే ఉంటది..