నాని ఫ‌స్ట్ స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధం అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్, రుష్కర్‌ మీర్‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కి చాలా టైం ఉండడంతో సంక్రాంతి సందర్భంగా అభిమానులకి మంచి గిఫ్ట్స్ ఇచ్చేందుకు నాని సిద్ధమయ్యాడు. పండుగ మూడు రోజులు మూడు డిఫరెంట్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నట్టు ఇప్ప‌టికే వీడియో ద్వారా తెలిపాడు నాని. బోగి సంద‌ర్భంగా చిత్రంలో కృష్ణ పాత్ర‌కి సంబంధించిన లుక్‌ని తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో ఊర‌మాస్‌గా క‌నిపిస్తున్నాడు నాని. ఇక జనవరి 15 సంక్రాంతి రోజున అర్జున్ పాత్ర ఫస్ట్ లుక్, జనవరి 16 కనుమ రోజున మూవీలోని తొలి పాట‌ లిరికల్ వీడియోని విడుదల చేయనున్నారు. శైన్ స్క్రీన్స్ పతాకంపై గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఒక వైపు వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న నాని, మ‌రో వైపు వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి మంచి చిత్రాలు తెర‌కెక్కించిన‌ మేర్ల‌పాక క‌లిసి కృష్ణార్జున యుద్ధం చిత్రం చేస్తుండ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి.
× RELATED డీకే అరుణ వర్సెస్ జైపాల్ రెడ్డి