వివాహంలో నాని, బ‌న్నీల సంద‌డి చూశారా..!

ఒక‌రు నేచుర‌ల్ స్టార్ మ‌రొక‌రు స్టైలిష్ స్టార్. వీరిద్ద‌రు క‌లిసారంటే ఆ సంద‌డే వేరు. రీసెంట్‌గా హుషారైన పాట‌ల‌తో , అద‌ర‌గొట్టే స్టెప్పుల‌తో వారు చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. కామ‌న్ ఫ్రెండ్ వివాహానికి హాజ‌రైన వీరిద్ద‌రు ఆ ఫంక్ష‌న్‌లో నానా హంగామా చేశారు. ‘ఆర్య-2’ చిత్రంలోని ‘ఉప్పెనంత ఈ ప్రేమకి’ అనే పాటని అల్లు అర్జున్‌ పాడుతూ ఉంటే ఆయన సతీమణి స్నేహారెడ్డి స్టెప్పులేశారు. ఇక నాని నటించిన ‘నిన్నుకోరి’ చిత్రంలోని ‘అడిగా అడిగా’ పాటని నాని తన సతీమణికోసం పాడుతుంటే అక్కడుండే వారందరూ ఒక్కసారిగా ఈలలు వేసి గోల‌లు చేశారు. దీంతో పాటు బన్ని, నాని కలిసి‘ ఎటో వెళ్లి పోయింది మనసు’ చిత్రంలోని ‘ ప్రియతమా నీవచట కుశలమా?’అన్న పాట పాడటం అలరిస్తోంది. ఇక ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడయోలని బ‌న్నీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో ఇవి వైర‌ల్‌గా మారాయి. అయితే ఇవి రీసెంట్ వీడియోనా లేదంటే కొన్ని రోజుల క్రితం జ‌రిగిన ఫంక్ష‌న్‌కి సంబంధించిన వీడియోలా అనేది తెలియాల్సి ఉంది. ఇక వీరి సినిమాల విష‌యానికి వ‌స్తే నాని దేవ దాస్‌తో పాటు జ‌ర్సీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. బ‌న్నీ త్వ‌ర‌లో విక్ర‌మ్ కుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

Related Stories: