నంద‌మూరి ఫ్యామిలీకి యాక్సిడెంట్ గండం !

నంద‌మూరి తారక‌రామారావు పెద్ద కుమారుడు హ‌రికృష్ణ (61) కొద్ది సేప‌టి క్రితం రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. నెల్లూరులో వివాహ వేడుకకు హాజ‌రై వ‌స్తున్న క్ర‌మంలో ఆయ‌న కారు ప్ర‌మాదంకి గురై హ‌రికృష్ణ త‌నువు చాలించారు. నల్లగొండ జిల్లా అన్నెపర్తి పోలీస్ బెటాలియన్ సమీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే నంద‌మూరి ఫ్యామిలీని న‌ల్ల‌గొండ జిల్లా ప్రాంతంలోనే యాక్సిడెంట్ గండం వెంటాడుతున్న‌ట్టు గ‌త సంఘ‌ట‌న‌ల‌ని బ‌ట్టి తెలుస్తుంది. 2009 ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లి వ‌స్తూ న‌ల్ల‌గొండ జిల్లాలోని మోతే స‌మీపంలో ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో ఎన్టీఆర్ అదృష్ట‌వ‌శాత్తు బ్ర‌తికి బ‌య‌ట‌పడ్డాడు. ఇక హ‌రికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ ఇటీవల నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇప్పుడు న‌ల్ల‌గొండ జిల్లాల‌నే హ‌రికృష్ణకి యాక్సిడెంట్ కావ‌డం నంద‌మూరి అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌పరుస్తుంది. నంద‌మూరి హ‌రికృష్ణ మృతిపై సినీ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరారు.

Related Stories: