రేపటి నుంచి ‘నమామీ గంగ’ కార్యక్రమం

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం రేపటి నుంచి ‘నమామీ గంగ’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ఉమాభారతి, నరేంద్రతోమర్, మహేశ్‌శర్మ నమామీ గంగ కార్యక్రమాన్ని హరిద్వార్ నుంచి ప్రారంభించనున్నారు. ఉత్తరాఖండ్ సీఎం హరీష్‌రావత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో గంగానది ప్రక్షాళన, స్మశానవాటికలు, ఘాట్ల నిర్మాణం, పునరుద్ధరణ, గంగానది సుందరీకరణ పనులను కేంద్రమంత్రులు పర్యవేక్షించనున్నారు. గంగానది పరివాహక రాష్ర్టాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Related Stories: