5 గంటలకు ఫలితం..

-రేపే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ -సాయంత్రం 5 గంటల తర్వాతే ఫలితం -ప్రతి సెగ్మెంట్‌కు 14 టేబుళ్ల ఏర్పాటు -ప్రతి రౌండ్‌లో 14 ఈవీఎంల లెక్కింపు -20 రౌండ్లలో మొత్తం లెక్కింపు -జేపీఎన్‌ఈఎస్ వద్ద పటిష్ట భద్రత
మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : మరి కొన్ని గంటల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితం తేలనుంది. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితం తేలేందుకు సుదీర్ఘంగా 43 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు ప్రకారం తెలంగాణలో తొలి విడత ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు పూర్తయ్యాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూ ముల్లో భద్రపరిచారు. అభ్యర్థులు తమ భవిత వ్యం కోసం రోజులు లెక్కపెడుతూ వస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సుప్రీం కోర్టు తీసుకువచ్చిన కొత్త నిబంధన మేరకు కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కానుంది. ఈ సారి ఈవీఎంల లెక్కింపుతో పాటు ఎంపిక చేసిన వీవీ ప్యాట్‌లను సైతం లెక్కిస్తారు. ఈ ప్రక్రియకు సమయం పడుతున్నందున ఫలితం సాయంత్రం 5 గంటల త ర్వాతే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కౌం టింగ్ కోసం పూర్తి ఏర్పాటు చేసిన అధికార యం త్రాంగం అందుకు సిబ్బందిని సైతం శిక్షణ కార్యక్రమాలతో సిద్ధంగా ఉంచింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7అసెంబ్లీ స్థానాలుండగా మొత్తం 1871 పోలింగ్ కేంద్రాలు న్నాయి. అత్యధికంగా మక్తల్‌లో 280 పోలింగ్ కేంద్రాలుండగా.. అత్యల్పంగా షాద్‌నగర్‌లో 246 పోలింగ్ కేంద్రాలున్నాయి. షాద్‌నగర్ 18, జడ్చర్ల 19 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుండగా... మిగతా అన్ని నియోజకవర్గాల్లో 20 రౌండ్ల పాటు లెక్కింపు సాగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. ఫలితం మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాతే రానుంది. కౌంటింగ్ సాగుతుందిలా... 23వ తేదీ ఉదయం 5 గంటలకు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను తెరుస్తారు. అభ్యర్థులు నియమించుకున్న వారి ఏజెంట్లు ఉదయం 7:30 గంటలకు తమకు ఇచ్చి న పాసులు, గుర్తింపు కార్డులతో సహా కౌంటింగ్ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కారు, బైక్ తాళం చెవులు.. వంటివి కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించరు. కౌంటింగ్ సెంటర్ ఆవరణలోనే భోజన వసతి ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి 14 టేబుళ్లు కేటాయించారు. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లపై 14 ఈవీఎంలను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కో టేబుల్ వద్ద ఓ సూపర్ వైజర్, ఓ అసిస్టెంట్, ఓ మైక్రో అబ్జర్వర్ ఉంటారు. వీరికి అదనంగా సిబ్బందినీ నియమించారు. పోస్టల్ బ్యాలెట్లను మహబూబ్‌నగర్ అసెంబ్లీ కౌంటింగ్ హాల్‌లో లెక్కిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టేబుల్‌ను కేటాయించారు. పోస్టల్ బ్యాలెట్ కౌం టింగ్ కోసం అదనపు ఏజెంట్లకు అవకాశం కల్పించారు. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. చివరి రెండు రౌం డ్లకు ముందు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తి చేస్తారు. జారీ చేసిన 2406 పోస్టల్ బ్యాలెట్లలో 708 పోస్టల్ బ్యాలెట్లు అంది నట్లు అధికారులు తెలిపారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వా త ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లాటరీ పద్ధతిలో 5వీవీ ప్యాట్లను ఎంపిక చేసి 8వ టేబుల్‌పై లెక్కిస్తారు. అనంతరం వాటికి కట్టుదిట్టంగా సీల్ వేస్తారు. అంటే 7అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 35 ఎంపిక చేసిన వీవీ ప్యాట్లను లెక్కిస్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీవీ ప్యాట్ల ను లెక్కిస్తున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపు ప్రక్రియ కారణంగా ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెలువడనున్నాయి. పాసులుంటేనే అనుమతి... భగీరథ కాలనీలో ఉన్న జేపీఎన్‌ఈఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి జారీ చే సిన పాసులు ఉన్న వా రిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ పాస్‌తో పాటు అదనం గా ఓ గుర్తింపు కార్డును కూడా వెంటతెచ్చుకోవ డం తప్పనిసరి. అధికారులు, సిబ్బంది, మీడియాకు సంబంధించిన వారికి ఇప్పటికే రిటర్నింగ్ అధికారి పాసులు జారీ చేశారు. వెబ్‌సైట్‌లో వెంటవెంటనే ఫలితాలు కౌంటింగ్ హాల్‌లో ఉన్న వారికి అక్కడి పరిస్థితి మాత్రమే తెలుస్తుంది. కానీ సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను ఫా లో అయితే చాలు... ఎక్కడ ఉన్నా అందరిక కంటే ముందే ఫలితాలను తెలుసుకోవచ్చు. suvidha. eci.gov.in ద్వారా ఫలితాలను వెంటవెంటనే తెలుసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ప్రతి రౌండ్ ఫలితాలను కౌంటింగ్ సెంటర్ వద్ద వెల్లడించడానికి ముందే అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అంటే కౌం టింగ్ కేంద్రం వద్ద ఉన్న వారి కంటే ఇంటి వద్ద కూర్చుని ఎన్నికల సంఘం వెబ్ సైట్‌ను చూసే వారికే ఫలితాలు త్వ రగా తెలుస్తాయి. కాబట్టి ఈ సారి ప్రతి రౌండ్ ఫలితాలు వెబ్‌సైట్ ద్వారానే ముందు వెల్లడవుతాయి.

Related Stories: