తాతా మనవళ్లుగా..?

అక్కినేని మూడు తరాల వారసులంతా కలిసి నటించిన చిత్రం మనం. ఈ చిత్రంలో నాగచైతన్య తండ్రిగాను, నాగార్జున కొడుకుగానూ నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెరపైకి రానున్న సినిమాలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పాత్రల్లో వీరిద్దరు కనిపించనున్నారని తెలిసింది. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి కల్యణ్‌కృష్ణ కురసాల త్వరలో సీక్వెల్‌ని రూపొందించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి బంగార్రాజు అనే టైటిల్‌ను ఇదివరకే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జ్జునకు మనవడిగా నాగచైతన్య నటించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. బంగార్రాజుగా నాగార్జున నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని చిత్ర బృందం త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.