బ‌ర్త్‌డే రోజున విషాదంలో నాగార్జున‌

ప్ర‌ముఖ సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి లోనయింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. బ‌ర్త్‌డే బాయ్ నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ద్వారా హ‌రికృష్ణ మృతిపై సంతాపం తెలియ‌జేస్తూ ‘కొన్ని వారాల క్రితమే ఆయన నాతో.. నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని అన్నారు. ఇప్పుడు ఆయన ఇక లేరు. మిస్‌ యూ అన్న’ అంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. హ‌రికృష్ణ‌, నాగార్జున కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సీతారామ‌రాజు చిత్రం మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.
× RELATED డీకే అరుణ వర్సెస్ జైపాల్ రెడ్డి