మరో మల్టీ స్టారర్ కి ఓకే చెప్పిన నాగ్

టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం రాజుగారి గది కి సీక్వెల్ గా రాజుగారి గది2 అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ హరర్ థ్రిల్లర్ గా రూపొందుతుండగా ఇందులో సమంత, సీరత్ కపూర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగ్ రాజుగారి గది2 చిత్రం తర్వాత మరో మల్టీ స్టారర్ చేయనున్నాడని అంటున్నారు. ఊపిరి అనే చిత్రంలో కార్తీతో కలిసి మల్టీ స్టారర్ చేసిన నాగ్ తన తదుపరి సినిమాలో నిఖిల్ తో కలిసి నటించనున్నాడని చెబుతున్నారు. ప్రేమమ్ దర్శకుడు చందూ మొండేటి ఇటీవల నాగ్ ని కలిసి ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ని వినిపించగా, ఆ కథకు ఇంప్రెస్ అయిన నాగ్ ఆ ప్రాజెక్టుకి వెంటనే ఓకే చెప్పాడట. ఇక ఇందులో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేశారని చెబుతున్నారు. ఈ అమ్మడు మరి నిఖిల్ సరసన నటిస్తుందా లేదంటే నాగ్ సరసన నటిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదు. ఏప్రిల్ లో ఈ మల్టీ స్టారర్ మూవీ లాంచ్ కానుందని చెబుతున్నారు. మరి ఈ వార్తపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related Stories: