ఇటు సౌత్ అటు నార్త్ చుట్టేస్తున్న కింగ్ నాగార్జున‌

టాలీవుడ్ న‌వ మ‌న్మ‌థుడు నాగార్జున ప్ర‌స్తుతం ఇటు సౌత్ అటు నార్త్ అంతా చుట్టేస్తున్నాడు. తెలుగులో దేవ‌దాస్ అనే సినిమా చేస్తున్న నాగ్ హిందీలో బ్ర‌హ్మ‌స్త్రా అనే చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. త్వ‌ర‌లో త‌మిళ సినిమా గురించి ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని చెప్పాడు. ఇక ఒ మ‌ల‌యాళ సినిమాకి కూడా ఆయ‌న సైన్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. చి.ల‌.సౌ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగ్‌ని విలేక‌రులు దేవదాస్‌కి సీక్వెల్ ఉంటుందా అని ప్ర‌శ్నించారు. సినిమా హిట్ అయితే త‌ప్ప‌క సీక్వెల్ చేస్తామ‌ని అన్నారు. చిత్రంలో నాగ్ దేవ్‌ పాత్ర‌లో క‌నిపిస్తే నాని దాస్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా సీక్వెల్ గురించి కూడా నాగ్ క్లారిటీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ- స‌త్యానంద్ సోగ్గాడే సీక్వెల్‌కి క‌థ సిద్ధం చేస్తున్నారు. ఎవ‌రి స్క్రిప్ట్ పక్క‌గా కుదిరితే దానిని బ‌ట్టి సినిమా చేస్తాం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియ‌జేస్తాం అని నాగార్జున తెలిపారు. నాగ్ చివ‌రిగా ఆఫీస‌ర్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా , ఈ మూవీ అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చింది.

Related Stories: