కర్త కర్మ క్రియ

నాగు గవర దర్శకుడిగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రానికి కర్త కర్మ క్రియ అనే టైటిల్‌ను ఖరారుచేశారు. వసంత్ సమీర్, సెహర్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాత. టైటిల్ ఫస్ట్‌లుక్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. దర్శకుడు మాట్లాడుతూ యథార్థ ఘటనల స్ఫూర్తితో రూపొందిస్తున్న రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. నేటి సమాజంలో జరుగుతున్న నేరాలను, వాటి వెనకున్న వాస్తవాల్ని సినిమాలో చూపిస్తున్నాం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, చక్కటి ప్లానింగ్‌తో సినిమా చేశాం. కథకు వందశాతం సరిపోయే టైటిల్ ఇది అని తెలిపారు. మా బ్యానర్‌లో గతంలో వచ్చిన చిత్రాలకు భిన్నమైన కథ, కథనాలతో చేస్తున్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మోషన్ పోస్టర్, టీజర్ విడుదలచేస్తాం అని నిర్మాత తెలిపారు. రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రామ్‌ప్రసాద్, కాదంబరి కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గాకిషోర్ బోయిదాపు, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, నిర్మాణ నిర్వహణ: వినాయకరావు.