గ్రాండ్ గా లాంచ్ అయిన శైలజా రెడ్డి అల్లుడు చిత్రం

యువ సామ్రాట్ నాగ చైతన్య, క్రేజీ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కొద్ది సేపటి క్రితం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దిల్ రాజు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. జనవరి 5 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తుంది. అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అత్త పాత్రలో రమ్యకృష్ణ లేదంటే శ్రీదేవి నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించనుంది. ప్రస్తుతం చైతూ సవ్యసాచి అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
× RELATED తాగిన మైకంలో బాంబు బెదిరింపులు..జైలు శిక్ష