మేలో చైతూ లుక్ ఇస్తానంటున్న మారుతి

పెళ్లి త‌ర్వాత అక్కినేని హీరో నాగ చైత‌న్య స్పీడ్ పెంచాడు. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌వ్య‌సాచి సినిమా చేస్తున్న చైతూ.. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైలజా రెడ్డి అల్లుడు (వ‌ర్కింగ్ టైటిల్‌) అనే సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సామ్‌తో క‌లిసి ఓ మూవీ చేస్తున్నాడు. త్వ‌ర‌లో బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ మూవీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. చైతూ చేస్తున్న ఈ సినిమాల‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే స‌వ్య‌సాచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రో వైపు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ చేస్తున్న చిత్రం ఎలా ఉంటుంది, సినిమా టైటిల్ ఏంటీ అనే అంశాల‌పై అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. దీనిపై మారుతి త‌న ట్విట్ట‌ర్ ద్వారా కొంత క్లారిటీ ఇచ్చాడు. చై మూవీ గురించి అంద‌రు అడుగుతున్నారు. ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ మేలో ఇస్తాను అని ట్వీట్ చేశాడు. మీరు ఈ సినిమా ఎలా ఉండాల‌నుకుంటున్నారో అలానే ఉంటుంద‌ని మారుతి అన్నాడు. అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అత్త పాత్రలో రమ్యకృష్ణ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తుంది.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..