ఒక్క ట్వీట్ తో పుకార్లకి చెక్ పెట్టిన చైతూ

అక్కినేని నాగ చైతన్య సమంతని వివాహం చేసుకున్న తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి చస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చైతూ ఎడమ చేయి పని చేయని యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అనే చిత్రం కూడా చేస్తున్నాడు. అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మంచి ఎంటర్ టైనింగ్ ఉంటుందని సమాచారం. అయితే ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా నాగ చైతన్య- బాబి కాంబినేషన్ లో ఓ మూవీ పట్టాలెక్కనుందని, ఇందులో రకుల్ కథానాయికగా నటించనుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక సమంత కథానాయికగా మరో చిత్రం చేయనున్నాడని రూమర్స్ వచ్చాయి. దీనిపై నాగ చైతన్య తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. నా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి వస్తున్న వార్తలలో నిజం లేదు. సవ్యసాచి, శైలజా రెడ్డి చిత్రాలలో మాత్రమే నటిస్తున్నాను. ఈ రెండు సినిమాలు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయి. ఈ ఏడాది బాగా కలసి వచ్చింది. మంచి కథాంశం ఉన్న ప్రాజెక్ట్స్ నా దగ్గరికి వస్తున్నాయి. త్వరలోనే నా తదుపరి సినిమాల గురించి వెల్లడిస్తానని ట్వీట్ చేశారు నాగ చైతన్య.
× RELATED పాన్ అప్లికేషన్ లో తల్లి పేరూ.. పెట్టొచ్చు!