మెగా డాట‌ర్స్‌తో మెగా బ్ర‌ద‌ర్ పిక్ అదుర్స్‌

మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ వార్త అయిన అభిమానుల‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఓ క్రికెట్ టీంలా త‌యారు కాగా, ఈ హీరోలంద‌రు మంచి మంచి సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈ ఫ్యామిలీలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లు రంగాల‌లో రాణిస్తున్నారు. ఒక మ‌న‌సు చిత్రంతో నిహారిక మెగా హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇక చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత‌ స్టైలిస్ట్‌గా అటు తండ్రికి ఇటు సోద‌రుడి సినిమాల‌కి ప‌ని చేస్తుంది. ఇక శ్రీజ కూడా త్వ‌ర‌లో ప్రొడ‌క్ష‌న్ భాద్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నుంద‌ని టాక్‌. క‌ట్ చేస్తే మెగా డాట‌ర్స్‌తో క‌లిసి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఓ ఫంక్ష‌న్‌కి అటెండ్ అయ్యారు. అక్క‌డ ఇద్ద‌రు కూతుళ్ళ‌తో క‌లిసి ఫోటోకి ఫోజులిచ్చాడు నాగ బాబు. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

Related Stories: