ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ముఖ్య పాత్ర కోసం మెగా బ్ర‌దర్

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానున్న ఈ చిత్రంకి సంబంధించి రోజుకొక వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని పాత్రల ఎంపికను చాలా జాగ్రత్తగా చేపడుతుండ‌గా, లీక్ అవుతున్న వార్త‌ల‌కి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుండ‌గా శ్రీదేవిగా ర‌కుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ ,మరో కీలక పాత్ర హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి,ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా నటిస్తుండ‌గా, ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి మంజిమో మోహ‌న్ న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు నటిస్తున్నాడు అని ప్ర‌చారం జ‌రుగుతుంది. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలో మెగా బ్రదర్ చేర‌డంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.

Related Stories: