జ్యోతిక 'నాచియార్'న్యూ ప్రోమో వీడియో

ఒకప్పుడు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న జ్యోతిక, త‌మిళ హీరో సూర్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉంది. 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చింది. .ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు సాధించింది. ప్రస్తుతం తాను మంచి స్క్రిప్ట్ లని ఎంచుకుంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. ఐకానిక్ ఫిలిం మేకర్ బాలా డైరెక్షన్ లో నాచియార్ అనే సినిమా చేస్తుంది జ్యోతిక‌. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ మూవీగా ఉంటుందని సమాచారం. క్రూరమైన పోలీసాఫీసర్ పాత్రలో జ్యోతిక న‌టిస్తుండ‌గా.. ఆమె నటన.. యాటిట్యూడ్ అన్నీ కూడా సంచలనం రేపేలా ఉన్నాయి. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఇత‌ని పాత్ర ఫ‌న్నీగా ఉండ‌డంతో పాటు ఆస‌క్తిని క‌లిగిస్తుంది. క్రైమ్ డ్రామా మూవీగా రూపొందిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. తాజాగా మూవీకి సంబంధించి ప్రోమో వీడియో విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌లో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఈ ప్రోమో వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
× RELATED నామినేషన్ల చివరి రోజు కూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్