వ‌యోలెంట్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ్యోతిక‌

ఒకప్పుడు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న జ్యోతిక, త‌మిళ హీరో సూర్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉంది. 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చింది. .ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు సాధించింది. ప్రస్తుతం తాను మంచి స్క్రిప్ట్ లని ఎంచుకుంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. ఐకానిక్ ఫిలిం మేకర్ బాలా డైరెక్షన్ లో నాచియార్ అనే సినిమా చేస్తుంది జ్యోతిక‌. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ మూవీగా ఉంటుందని సమాచారం. ఇటీవ‌ల ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల కాగా ఇందులో జ్యోతిక అవ‌తారం, ఆమె చెప్పిన డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌కి షాక్‌ని క‌లిగించాయి. ఇక తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. క్రూరమైన పోలీసాఫీసర్ పాత్రలో జ్యోతిక లుక్.. ఆమె నటన.. యాటిట్యూడ్ అన్నీ కూడా సంచలనం రేపేలా ఉన్నాయి. నువ్వు పోలీసువా.. రౌడీవా అంటూ ఉన్నతాధికారి అడ‌గ‌డం, ఒక రౌడీ విలవిలలాడుతున్నట్లు చూపించడం.. వెంటనే జ్యోతిక నోట్లో బ్లేడ్ కనిపించడాన్ని బట్టి బాలా ఆమె పాత్రను ఎలా చూపించాడో తెలుస్తోంది. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఇత‌ని పాత్ర ఫ‌న్నీగా ఉండ‌డంతో పాటు ఆస‌క్తిని క‌లిగిస్తుంది. క్రైమ్ డ్రామా మూవీగా రూపొందిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. తాజాగా విడుదలైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Related Stories: