తంత్ర రహస్యమేమిటి?

పరమశివ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం నా పేరు తంత్ర. వంశీ, ఆర్తి, తపస్వి, ఐశ్వర్య, విజయ్, సంజన ప్రధాన పాత్రల్లో నటించారు. మేడం శ్రీధర్ దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. తంత్ర అనే అమ్మాయి కథేమిటి? ఆమె జీవిత రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా అందరిని మెప్పిస్తుంది. కథానుగుణంగా గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది అన్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం అని నిర్మాత పేర్కొన్నారు. షాయాజీషిండే, ఛత్రపతి శేఖర్, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: జాక్‌పొట్ల, నిర్మాత: జగన్ (జె.డి), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీధర్ యమ్.