కోహ్లీ ఎంపికను నేను అడ్డుకోలేదు

న్యూఢిల్లీ: నేషనల్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపునకు తానే కారణమని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ చేసిన ఆరోపణలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ స్పందించాడు. దిలీప్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, అందులో ఎలాంటి నిజంలేదని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఎవరి తరఫున అతడు ఇలా మాట్లాడుతున్నాడో? అతని ఉద్దేశమేమిటో? ఏదైనా కానివ్వండి.. అతడి ఆరోపణల్లో మాత్రం నిజంలేదు. ఒక క్రికెటర్ ఇలా మాట్లాడటం బాగుండదు. ఛైర్మన్ పదవి కొనసాగింపు విషయంలో నేను జోక్యం చేసుకున్నట్లు అతడు చేసిన వ్యాఖ్యలు పూర్తి అబద్ధం. జట్టు ఎంపిక విషయాల్లో నేనెప్పుడూ కల్పించుకోలేదు. ఒక క్రికెటర్‌గా అతన్నీ నెనొంతో గౌరవిస్తాను. నేషనల్ హీరో లాగా భావించాం. ఆయన ఇలా మాట్లాడటం చాలా బాధాకరం అని శ్రీనివాసన్ చెప్పారు. 2008 శ్రీలంక టూర్‌కు విరాట్ కోహ్లీ ఎంపికను తాను అడ్డుకోలేదని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ఆ పర్యటనకు సంబంధించి తమిళనాడు ఆటగాడు బద్రినాథ్‌ని కాదని కోహ్లీని భారత జట్టులోకి సెలక్ట్ చేయడాన్ని అప్పటి కెప్టెన్ ధోనీతో పాటు బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్ వ్యతిరేకించారని.. దాంతోనే తనను చీఫ్ సెలక్టర్ పదని నుంచి తప్పించారని వెంగ్‌సర్కార్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Related Stories: