సెట్‌లోకి వ‌చ్చిన వ్య‌క్తిని చూసి షాక్ అయిన అఖిల్

యంగ్ హీరో అఖిల్ ప్ర‌స్తుతం తొలిప్రేమ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో త‌న మూడో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో సెట్లోకి హ‌లో చిత్రంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ చిన్న‌నాటి పాత్ర పోషించిన మైరా దండేక‌ర్ ఎంట్రీ ఇచ్చింది. స‌డెన్‌గా సెట్లోకి ఆమె ఎంట్రీని చూసి షాక్ అయిన అఖిల్ త‌న‌ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఫోటోకి ఫోజులిచ్చాడు. ఈ పిక్ అఖిల్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. మైరాతో క‌లిసి దిగిన ఫోటోని అఖిల్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ..స‌ర్‌ప్రైజ్ ఇచ్చినందుకు థాంక్యూ స్వీట్ హార్ట్ మైరా దండేకర్. నీ న‌వ్వు నీలానే ప్ర‌త్యేకం. నీ టాలెంట్ చాలా గొప్ప‌ది. దాన్ని జాగ్ర‌త్త‌గా ఉండ‌నివ్వు. త్వ‌ర‌లో మ‌ళ్ళీ క‌లుద్దాం. నా ల‌వ్ నీతో ఎల్ల‌ప్పుడు ఉంటుంది జున్ను అని అన్నాడు. ఇక మైరా కూడా అదే ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ.. హైద‌రాబాద్ సెట్‌లో నా సోద‌రుడు అఖిల్‌ని స‌ర్‌ప్రైజ్ చేశా. టైం చాలా స‌ర‌దాగా గ‌డిచింది అని కామెంట్ పెట్టింది. అఖిల్ తాజా చిత్రంలో నిధి అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చిత్రం నిర్మిత‌మవుతుంది. ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.
× RELATED మరో అరుదైన రికార్డు చేరువలో ధోనీ