స్వేచ్ఛా విహారం చేయాలి!

ప్రతి మహిళ స్వతంత్య్ర వ్యక్తిత్వంతో జీవనం సాగించాలని ఉద్బోధించింది బెంగళూరు సుందరి దీపికాపదుకునే. ఏ పని చేసిన సాధికారికంగా వ్యవహరించాలని హితవు పలికింది. ముంబయిలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. దీపికపదుకునే మాట్లాడుతూ నిత్య జీవితంలో మహిళలు ఎన్నో పాత్రల్ని పోషిస్తుంటారు. బాధ్యతలతో సతమతమవుతుంటారు. స్వేచ్ఛగా సమయం గడుపుదామంటే వారికి ఏమాత్రం వీలు చిక్కదు. ఎక్కడికి వెళ్లినా ఇంటి గురించో, కుటుంబం గురించో ఆలోచిస్తుంటారు. ఎప్పుడూ ఏదో తెలియని తొందరలో బ్రతికేస్తుంటారు. ఈ క్రమంలో జీవితానందాల్ని కోల్పోతుంటారు. ఈ ధోరణిలో కొంత మార్పు రావాలి. మనవాళ్ల శ్రేయస్సు కోసం తపించడంలో తప్పులేదు. అయితే వారికోసమే సర్వం త్యాగం చేస్తూ అదే ప్రపంచంగా బ్రతకొద్దు. జీవితమనే వేదికపై స్వేచ్ఛావిహారం చేయాలి అని చెప్పింది.