మై హైదరాబాద్ - మై రెస్పాన్స్‌బులిటీ

వినూత్న కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచడం, నియమ నిబంధనలు పాటించి బాధ్యతాయుత పౌరులుగా ఉండేందుకు, ప్రతిఒక్కరిలో స్ఫూర్తిని నింపేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మై హైదరాబాద్- మై రెస్పాన్స్‌బులిటీ అనే పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ఫొటో సెల్ఫీ స్టాండ్‌ను నెక్లెస్‌రోడ్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజైన బుధవారం ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు.

Related Stories: