ఎడపల్లి ఇసుక క్వారీ వద్ద యువకుడి హత్య

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని మహాదేవపూర్ మండలం ఎడపల్లిలోని ఇసుక క్వారీ వద్ద హత్య ఘటన చోటుచేసుకుంది. కిషోర్ అనే యువకుడిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. మృతుడు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. స్థానికంగా ఎడపల్లి ఇసుక క్వారీలో పనిచేస్తున్నాడు. హత్యకు సంబంధించిన కారణం ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

Related Stories: