మూడు జంటల కథ

స్మైల్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం మూడు పువ్వులు ఆరు కాయలు. పబ్బిన వెంకట్రావు నిర్మాత. రామస్వామి దర్శకుడు. అర్జున్ యజత్, సౌమ్యవేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమాచౌదరి కీలక పాత్రధారులు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ప్రేమంటే చంపుకోవడమో చావడమో కాదు. చచ్చేదాక కలిసి బ్రతకడమే. కన్నవాళ్ల కలల్ని నిజం చేస్తూ, లక్ష్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందన్నదే చిత్ర ఇతివృత్తం. కథానుగుణంగా మంచి సంగీతం కుదిరింది. భాస్కరభట్ల, చంద్రబోస్ చక్కటి సాహిత్యాన్నందించారు. మూడు జంటల కథ ఇది. మంచి తారాగణం కుదిరింది అన్నారు. తమ సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రమిదని, వైవిధ్యమైన కథ తో తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. వినూత్న కథా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని నాయకానాయికలు పేర్కొన్నారు. ఈ చిత్రాని కెమెరా: యం.మోహన్‌చంద్; సంగీతం: క్రిష్ణసాయి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామస్వామి.

× RELATED ముఖ్య అతిథులుగా..