ధోనీ ఎంత ఆదాయ పన్ను కట్టారో తెలుసా?

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదాయం పన్ను ఎంత కట్టారో తెలిస్తే షాక్ కావాల్సిందే. 2017-18 సంవత్సరానికి గాను ధోనీ సుమారు రూ.12.17 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాడు. జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన ధోనీ.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచాడు. పన్ను చెల్లించడమే కాదు, రానున్న వార్షిక ఆదాయానికి సంబంధించి సుమారు మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్‌ను ముందే డిపాజిట్ కూడా చేశాడు. 2016-17 సంవత్సరంలో ధోనీ మొత్తం రూ.10.93 కోట్లు ట్యాక్స్‌గా చెల్లించినట్లు చీఫ ఇన్‌కమ్ ట్యాక్స్ కమీషనర్ వీ మహాలింగం తెలిపారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధోనీ విఫలమయ్యాడు. ఆశించినతంగా రన్స్ రాబట్టలేదు. దీంతో అతను వన్డేలకు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ రూమర్స్‌ను కోచ్ రవిశాస్త్రి కొట్టిపారేశారు. తనకు కావాల్సినప్పుడు ధోనీ రిటైర్ అవుతాడని మాజీ క్రికెటర్ సచిన్ కూడా తెలిపారు. 50 పరుగల సగటు కన్నా ఎక్కువ సగటుతో వన్డేల్లో 10 వేల పరుగులను పూర్తి చేసిన క్రికెటర్‌గా ధోనీ ఇటీవల రికార్డు క్రియేట్ చేశాడు. సచిన్, గంగూలీ తర్వాత 10వేల పరుగుల రికార్డును అతివేగంగా అందుకున్న మూడవ భారతీయ ప్లేయర్‌గా ధోనీ నిలిచాడు.

Related Stories: