ధోనీ vs బ్రావో.. త్రీ రన్ చాలెంజ్.. ఎవరు గెలిచారో చూడండి!

ముంబై: వరల్డ్ క్రికెట్‌లో ధోనీ బెస్ట్ ఫినిషర్, బెస్ట్ కెప్టెన్, బెస్ట్ బ్యాట్స్‌మన్.. అయితే వీటన్నిటికీ మించి అతని ఫిట్‌నెస్ లెవల్స్ అదుర్స్ అనిపిస్తాయి. 36 ఏళ్ల వయసులోనూ యువ క్రికెటర్లకు సవాలు విసరడంలో ధోనీ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇంతకుముందు ఓసారి హార్దిక్ పాండ్యాతో రన్నింగ్ చాలెంజ్‌లో ఈజీగా గెలిచాడు. ఇప్పుడు తాజాగా ఐపీఎల్ ఫైనల్ అయిపోయిన తర్వాత చెన్నై టీమ్ మేట్ డ్వేన్ బ్రావోతో త్రీ రన్ చాలెంజ్‌కు సై అన్నాడు. వికెట్ల మధ్య మూడు పరుగులు ఎవరు త్వరగా ముగిస్తారన్నది ఈ చాలెంజ్. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే ధోనీయే ఈ చాలెంజ్‌లో గెలిచాడని ప్రత్యేకంగా చెప్పాలా.. ఆ వైరల్ వీడియో మీరూ చూడండి..

Related Stories: