దాస్ మూవీ సెట్లోకి జున్ను ఎంట్రీ

నేచురల్ స్టార్ నాని గ‌త‌ ఏడాది మార్చి 29న‌ తండ్రి ప్రమోషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2న తొలిసారి త‌న త‌న‌యుడిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన నాని ఆ త‌ర్వాత కొద్ది సార్లు మాత్ర‌మే త‌న‌యుడితో క‌లిసి దిగిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా త‌న ముద్దుల కొడుకు అర్జున్ ( జున్ను) దేవ‌దాస్ సెట్లోకి రావ‌డంతో ఆయ‌న‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. గ‌త ప‌దేళ్ళుగా ఎవ‌రి ముందు న‌టించ‌డానికైన భ‌య‌ప‌డ‌లేదు. ఇప్పుడు దాస్ సెట్‌కి జున్ను వ‌చ్చాడు అనే కామెంట్ పెట్టాడు నాని. ఆయ‌న పోస్ట్ చేసిన ఫోటో ప్ర‌స్తుతం వైర‌ల్ అయింది. దేవ‌దాస్ చిత్రంతో బిజీగా ఉన్న నాని మ‌రోవైపు జ‌ర్సీ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. దేవదాస్‌లో డాక్ట‌ర్ దాస్‌గా క‌నిపించ‌నున్నాడు నాని. నాని 2012 అక్టోబర్ 27న అంజనాతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. వీరి వివాహం వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రాజెక్టుల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికి ఫ్యామిలీతోను స‌ర‌దాగా టైం స్పెంట్ చేసేందుకు నాని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాడు అనే సంగ‌తి తెలిసిందే.
× RELATED గతంలో నెరవేర్చిన విధంగానే ఈసారి కూడా: కేసీఆర్