కొండగట్టు ప్రమాదం పట్ల ఎంపీ కవిత దిగ్భ్రాంతి

హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వద్ద జరిగిన రోడ్డుప్రమాద ఘటనపై టీఆర్‌ఎస్ ఎంపీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందని కవిత ట్వీట్ చేశారు. ప్రమాదస్థలి వద్దకు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డితో కలిసి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related Stories: