యంత్రాల కొరతతో కూలీల కొరతను అధిగమించవచ్చు..

జగిత్యాల జిల్లా: పొలాసలోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో నూతన వరినాట్ల యంత్రాల క్షేత్రస్థాయి ప్రదర్శనకు ఎంపీ కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ..యంత్రాల వాడకంతో కూలీల కొరతను అధిగమించొచ్చన్నారు.

పోచారం మాట్లాడుతూ..వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణలో 25 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందన్నారు. తెలంగాణలో కోటి 50 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నట్లు చెప్పారు. కూలీల కొరత నివారించేందుకు వ్యవసాయంలో యాంత్రీకరణ ముఖ్యమన్నారు. వరి నాటు యంత్రాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రైతులకు నచ్చిన కంపెనీ యంత్రాలు కొనుక్కోవచ్చు. యంత్రాలతో నాటువేస్తే ఎకరానికి రూ.2 వేల ఖర్చు తగ్గుతుందన్నారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు.

× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..