మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మెడలో చెప్పుల దండ

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ షెఖావత్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ టేస్తున్న ఆయన ఓట్లడిగేందుకు నాగడా గ్రామానికి వెళ్లారు. అభిమానుల స్వాగతసత్కారాల మధ్య ఓ వ్యక్తి వచ్చి ఎమ్మెల్యేకు చెప్పుల దండ వేశారు. ముందుగా ఆయన అది చూసుకోలేదు. మామూలుగా ఏదో మంచి దండే అయ్యుంటుందని అనుకున్నారు. తీరా పరికించి చూస్తే అది చెప్పుల దండ అని తెలుసుకుని సదరు వ్యక్తి మీద మండిపడ్డారు. దండ విసిరేసి అతనితో కలబడ్డారు. అదంతా ఓ వీడియోలో నమోదైంది. ఇప్పుడా ఈడియో వైరల్ అయ్యింది. బాహాబాహీ, ముష్టాముష్టి అన్నట్టుగా ఇద్దరూ ఫైటింగ్ మొదలుపెట్టార. ఇద్దరూ అలా తన్నుకుంటుంటే అక్కడున్నవారు విడిపించడానికి ప్రయత్నించడం వీడియోలో నమోదైంది. ఢిల్లీ సీఎం మీద కారం చల్లిన ఘటన నేపథ్యంలో ఈ చెప్పులదండ గొడవ చర్చనీయాంశమైంది. నేతలూ ఓటరు దగ్గరకు వెళ్లేటప్పుడు జరభద్రం.

Related Stories: