మోటోరోలా నుంచి మోటో జ‌డ్‌4 స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ తయారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటో జ‌డ్4 ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించలేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. మోటో జ‌డ్‌4 ఫీచ‌ర్లు... 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.
More in తాజా వార్తలు :