మోటోరోలా నుంచి మోటో పి30 స్మార్ట్‌ఫోన్

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో పి30 ని చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.21,315, రూ.25,380 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

మోటో పి30 ఫీచర్లు...

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Related Stories: