నోట్ల రద్దు లెక్కలు తేలాయి!

న్యూఢిల్లీ: భారీగా నల్లధనాన్ని వెలికితీస్తానంటూ రెండేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. అప్పటి నుంచి వెనక్కి వచ్చిన సొమ్మును ఆర్బీఐ లెక్కిస్తూనే ఉంది. మొత్తానికి ఇప్పటికి ఆ మొత్తమెంతో వెల్లడించింది. బ్యాంకులకు రద్దయిన నోట్లు రూ.15 లక్షల 30 వేల కోట్ల వరకు వచ్చాయని ఆర్బీఐ బుధవారం తెలిపింది. అంటే 99.3 శాతం రద్దయిన నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. కేవలం రూ.10 వేల 700 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకులకు రాలేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. నిజానికి నోట్ల రద్దు చేసిన తర్వాత సుమారు రూ.5 లక్షల కోట్ల నల్లధనం తిరిగి బ్యాంకులకు రాదని కేంద్రం ముందుగా అంచనా వేసింది.

ఇదంతా పన్నులు కట్టకుండా అక్రమంగా దాచుకున్న సొమ్ము అని, అది కచ్చితంగా బ్యాంకుల్లో జమ కాదని అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా మొత్తం సొమ్ము తిరిగి రావడంతో నోట్ల రద్దు దారుణంగా విఫలమైందన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. పైగా కొత్త నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐకి భారీగా ఖర్చయింది. దీంతో నోట్ల రద్దు వల్ల అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోగా ఆర్థిక వ్యవస్థపై కూడా భారీగా ప్రభావం చూపింది.

Related Stories: