వామ్మో.. ఈ కోతి విచిత్ర చేష్టలు చూడండి.. వీడియో

ఏరా.. కోతిలా తిక్కతిక్క చేస్తున్నావు అంటూ చాలా మంది కోతితో పోల్చుతుంటారు. ఎందుకంటే.. కోతి నిజంగానే తిక్క తిక్క చేస్తుంది. విచిత్ర చేష్టలు చేస్తుంటుంది. మనుషులను బెదిరించడం, వాళ్ల చేతిలో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లడం, బ్యాగులను లాక్కోవడం లాంటివి చేస్తుండటం మనం చూస్తూనే ఉంటాం కదా. సేమ్ ఇలాంటి ఘటనే ఒకటి కర్నాటకలో చోటు చేసుకున్నది. ఓ కోతి చిన్న పిల్లాడిని పట్టుకున్నది. ఆ బేబీ పక్కన కూర్చొని ఆ బేబీ మీద చేయి వేసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే దాన్ని అదిలించడానికి ప్రయత్నించారు. దాని బారి నుంచి ఆ పిల్లాడిని కాపాడే ప్రయత్నం చేశారు. కాని. అది అరుస్తూ.. అక్కడి వారిపై ఎదురు దాడికి దిగింది. దీంతో ఆ పిల్లాడిని ఏం చేస్తుందో అని అంతా టెన్షన్‌తో అక్కడ నిలబడ్డారు. ఓ మహిళ చీరను కూడా లాగబోయింది. ఇంతలో మరో సారి చీర కొంగును లాగుతూ కొంచెం అటువైపుకు కోతి వెళ్లగానే పిల్లాడిని అక్కడి నుంచి లాగేశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?