సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మోహ‌న్ బాబు 'ఫ‌సక్'మాట‌

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు రూటే స‌ప‌రేటు. ఆయ‌న మాట‌ల్లో గాంభీర్యం, డైలాగులకు అనుగుణంగా హావభావాలు , యాక్టింగ్ లో అదరగొట్టడం మోహ‌న్ బాబు సొంతం. విల‌న్‌గా, నటుడిగా విభిన్న పాత్ర‌లు పోషించిన మోహ‌న్ బాబు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. తాను ‘ఇండియా టుడే’ టెలివిజన్‌కి ఇంట‌ర్వ్యూ ఇస్తూ త‌న డైలాగులపై త‌న దైన స్టైల్‌లో వివ‌ర‌ణ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో ఎం.ధ‌ర్మ‌రాజు చిత్రంలో త‌న పాత్ర గురించి చెబుతూ ‘ఫసక్‌’ అనే మాటను వాడారు. ఇప్పుడు అదే మాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. నెటిజన్స్ త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో మీమ్స్ క్రియేట్ చేసి ర‌చ్చ చేస్తున్నారు. త‌న మాట‌కి ఇంత ఆద‌ర‌ణ ల‌భించ‌డం చూసి షాక్ అయిన మోహ‌న్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. #fasak అనే ప‌దం ఇంత‌ ట్రెండ్‌ కావడం సంతోషంగా ఉంది. నేను వాడిన మాటను ఉపయోగించి దాదాపు 200 స్పూఫ్‌ వీడియోలు వచ్చాయని విష్ణు చెప్పాడు. కొన్ని చూశాను కూడా. చాలా ఫన్నీగా ఉన్నాయి’ అని ట్వీట్‌ చేశారు.
× RELATED తిరుమలలో భక్తుల రద్దీ