మోదీ సర్కార్ అన్ని హద్దుల్నీ దాటేసింది..

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం అన్ని హద్దులను దాటేసిందని, ప్రజా పాలనలో దారుణంగా విఫలమైందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. పెట్రో ధరలను నిరసిస్తూ ఇవాళ ప్రతిపక్షలు ఢిల్లీలో నిరసన చేపట్టాయి. అక్కడ మాట్లాడిన మన్మోహన్.. మోదీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అన్ని పరిమితులను అతిక్రమించిందన్నారు. దేశ ప్రజలకు ప్రయోజనకరమైన అంశాలను మోదీ ప్రభుత్వం ఏదీ చేపట్టలేకపోయిందని, ఆ ప్రభుత్వం అన్ని హద్దులను దాటేసిందన్నారు. రైతులను ఆదుకోవడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైందన్నారు. కలిసి కట్టుగా ఐకమత్యంతో శాంతియుతంగా దేశాన్ని రక్షించుకోవాలని మన్మోహన్ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. భారత్ బంద్‌లో మొత్తం 21 విపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం ఏకం కావాలని మన్మోహన్ అన్నారు.

Related Stories: