రైతులందరికీ రైతు బీమా ఘనత సీఎం కేసీఆర్ దే..

జనగామ : రైతులందరికి ధీమాగా రైతు బీమా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ స్టేషన్ ఘనఫూర్ మండల కేంద్రంలొ ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసిఆర్ కే దక్కుతుందన్నారు.

29 రాష్టాల్లో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. రైతులకు పెట్టుబడి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. అనేక సంక్షేమ ఫథకాలు ఏ ప్రభుత్వం చేపట్టలేదనీ, కేవలం తెలంగాణ ప్రభుత్వమే చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణకు అడ్డుపడ్డ టిడిపి పార్టీని, చంద్రబాబును పొలిమేరలకు రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండలాల, గ్రామాల రైతు సమన్వయ కోఆర్డినేటర్లు, సభ్యులు పాల్గొన్నారు.

Related Stories: