మూడోస్థానం కోసం జర్మనీతో భారత్ పోరు

సా.గం.5.15నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో భువనేశ్వర్: హాకీ ప్రపంచ లీగ్ ఫైనల్స్ సెమీఫైనల్లో అర్జెంటీతో ఓటమితో ఫైనల్ చేరలేక పోయిన భారత హాకీ జట్టు ..మూడోస్థానం కోసం నేడు జర్మనీ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మూడోస్థానంతో కాంస్యపతకం అందుకుంటుంది. డిఫెన్స్‌లో తిరుగులేకుండా రాణిస్తున్న భారత జట్టును స్ట్రయికింగ్ లోపాలు కొంపముంచుతున్నాయి. దీనికి తోడు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంలో భారత్ ఇబ్బందులుపడుతున్నది. స్వర్ణం కోసం ఆస్ట్రేలియా, అర్జెంటీనా తలపడుతున్నాయి.