కాంగ్రెస్ నేతలకు సంస్కారం లేదు : ఎమ్మెల్యే ఆల

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోపోద్రిక్తులయ్యారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆదిపత్య పోరు కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో ఏనాడైనా డీకే అరుణ నోరు విప్పిందా? అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నది డీకే అరుణ కుటుంబమే అని తెలిపారు. సీఎం కేసీఆర్, హరీష్‌రావు, కవిత, కేటీఆర్ లాంటి నేతలు దొరకడం ప్రజల అదృష్టమన్నారు. చీప్ లిక్కర్ నుంచి కల్లు దాకా అడ్డమైన వ్యాపారాలన్నీ డీకే అరుణ కుటుంబం సొంతమని ధ్వజమెత్తారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?