ఉద్యోగం నుంచి తీసేశాడని హెచ్‌ఆర్ హెడ్‌పై కాల్పులు

గుర్‌గావ్: తనను ఉద్యోగం నుంచి తీసేశాడని ఓ వ్యక్తి హెచ్‌ఆర్ హెడ్‌పై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన గురుగావ్‌లో చోటుచేసుకుంది. జపాన్ బేస్‌డ్ కంపెనీ మిట్స్‌బుషి గురుగావ్‌లో కొలువై ఉంది. ఈ కంపెనీ హెచ్‌ఆర్ విభాగం హెడ్‌గా బినేశ్ శర్మ పనిచేస్తున్నాడు. కాగా అనైతిక ప్రవర్తన కారణంగా కంపెనీలో పనిచేసే జోగిందర్ అనే ఉద్యోగిని బినేశ్ శర్మ నిన్న ఉద్యోగం నుంచి తొలగించాడు. అప్పుడే బెదిరింపులకు పాల్పడిన జోగిందర్ వ్యాఖ్యలను బినేశ్ శర్మ తేలికగా తీసుకున్నాడు. నేడు ఉదయం 9 గంటలకు బినేశ్ శర్మ కారులో ఆఫీసుకు బయల్దేరగా బైక్‌పై మరోవ్యక్తితో కారును అనుసరించి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో బినేశ్‌శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితి తప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Stories: