మిషన్ భగీరథ ఇంట్రా పైప్‌లైన్ల దహనం

శంషాబాద్: శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడ సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్‌లైన్లకు మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. పైపులు కాలిపోయాయి. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం తీగలు తెగిపడ్డాయి. విద్యుత్‌శాఖ సిబ్బంది స్పందించి కరంటు సరఫరాను నిలిపివేశారు. రూ.6 లక్షలవరకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.